బాలికల వివాహవయస్సు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- Balaji Gurram
- Dec 21, 2021
- 1 min read

అమరావతి: మనదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వం లోని క్యాబినెట్ బాలికల వివాహ వయస్సును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మహిళా సంఘాలు ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఏమిటంటే.
పేదరికం: మనదేశంలో పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న బాలికలు చాల మంది ఉన్నారని, దీనివల్ల చదువుకోలేక ఇంటిదగ్గరే వుంటున్నారని, కుటుంబపెద్దలు బాలికలని బరువుగా భావించి వాల్లకి చిన్నవయసులోనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం మనదేశంలో పేదరికం తగ్గించే కార్యక్రమాల మీద ద్రుష్టి సాధించాలని సూచించారు.
చదువులు ఆపేయడం: చాలా మంది బాలికలు చదువును మధ్యలో ఆపేయడం ఇంకా జరుగుతుందని, దీనివల్లకూడా బాలికల వివాహాలు చిన్నవయసులోనే జరుగుతున్నాయని చెప్పారు. బాలికల చదువులు ఆగకుండా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు. బాలికలు చదువుకోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా చిన్న వయసులో పెళ్లిళ్లు చేసే అవకాశాలను ఆపొచ్చు అని అభిప్రాయపడ్డారు.
Comments