అమరావతి: ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కావడంతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
వీరిలో రాజకీయ ప్రముఖులు భారత ప్రధాని శ్రీ నరెంద్రమోది గారితో పాటు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గారు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారితోపాటు పలువురు కేంద్రమంత్రులు, మరియు రాష్ట్రాల మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే సినీరంగం నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, రామ జోగయ్య శాస్త్రి గారు, కోన వెంకట్ గారు, సోను సూద్ గారు, రవితేజ గారు, సత్యదేవ్, నితిన్, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, ఛార్మి కౌర్, కుష్భు ఇలా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యంగా వైసీపీ పార్టీ నేతలు మరియు కార్యకర్తలు పండుగలా జరుపుకున్నారు. ట్విట్టర్ వేదికగా ట్రెండ్ సృష్టించారు. ఇదిలా ఉండగా, జగన్ గారు మాత్రం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభోత్సవ కార్య క్రమంలో పాల్గొన్నారు.
コメント